కమ్యూనికేషన్ ఛానెల్స్ సాంకేతిక సమాచార వాహకాలు:
సమాచారము ఒక ప్రాంతము నుండి మరియొక ప్రాంతమునకు ప్రయాణించడానికి ఉపయోగించే పరికరాలను కమ్యూనికేషన్ ఛానెల్స్ అని అంటారు. ఇవి ముఖ్యంగా రెండు విధాలుగా వర్గీకరించబడ్డాయి. అవి:
1. గైడెడ్ సమాచార వాహకాలు
2. ఆన్ గైడెడ్ సమాచార వాహకాలు
ఏదైనా సమాచారము వైర్ ల సహాయంతో ప్రయాణించిన గైడెడ్ సమాచార వాహకాలు అందురు.
అదే విధముగా ఏదయినా సమాచారము వైర్ లతో సంబంధం లేకుండా ప్రయాణించిన ఆన్ గైడెడ్ సమాచార వాహకాలు అందురు.
ప్రస్తుతము వాడుకలో ఉన్న సాంకేతిక సమాచార వాహకాలు :
1. ట్విస్టెడ్ పైర్ కేబుల్
2. కొ – ఆక్సియల్ కేబుల్
3. మైక్రో వేవ్స్
4. ఫైబర్ ఆప్టిక్స్
1. ట్విస్టెడ్ పైర్ కేబుల్ :
ఈ యొక్క కేబుల్ ను టెలిఫోన్ ల ద్వారా సమాచార మార్పిడికి ఉపయోగిస్తారు. ఇది మొదట తరం కమ్యూనికేషన్ గా చెప్పవచ్చు. ఈ కేబుల్ ద్వారా అత్యధికంగా ఒక సెకనుకు 100 mbps సమాచారాన్ని పంపగలుగుతాము.
ట్విస్టెడ్ పైర్ యొక్క చిత్రం. 2. కొ – ఆక్సియల్ కేబుల్ : ఈ కేబుల్ ను ఒక చిన్న పట్టణం ను కలపడానికి ఉపయోగిస్తారు. ఈ కేబుల్ ట్విస్టెడ్ పైర్ కేబుల్ కంటే మెరుగైన వేగం తో సమాచారాన్ని పంపగలవు. ఈ కేబుల్ యొక్క వేగం ఒక సెకనుకు గరిష్టంగా 1 gbps గా ఉంటుంది.
కొ – ఆక్సియల్ కేబుల్ యొక్క చిత్రం
3. మైక్రో – వేవ్స్ :
వైర్ తో సంబంధం లేకుండా సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఈ పద్దతి చక్కగా ఉపయోగ పడతాయి. టవర్ నుండి టవర్ కు సమాచారమ్ ప్రయాణిస్తుంది. ఈ పద్దతిలో సమాచారము తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది.
మైక్రో వేవ్స్ యొక్క చిత్రం
4. ఫైబర్ ఆప్టిక్స్ :
ప్రస్తుతం మనం వింటున్న 3 g , 4 g , 5 g నెట్వర్క్ లకు ఫైబర్ ఆప్టిక్స్ ప్రధాన కారణం. అత్యధిక సమాచారాన్ని అత్యధిక వేగం తో సుదూర ప్రాంతాలకు చెరవేయడానికి ఈ కేబుల్స్ చక్కగా సహకరిస్తాయి. ఈ కేబుల్ మనకు మట్టిలో దొరికే అబ్రకమ్ అనే లోహంతో తయారుచేస్తారు. ఇంకా ఫైబర్ తో కూడా తయారు చేస్తారు. ఇందులో సమాచారము ఇంచుమించుగా కాంతి వేగం తో ప్రయాణిస్తుంది.
ఫైబర్ ఆప్టిక్స్ యొక్క చిత్రం.