ఈ పాన్ కార్డ్ ను డౌన్లోడ్ చేయడం ఎలా ? [HOW TO DOWNLOAD E PAN CARD]

                నేటి కాలములో ప్రతి ఒక్కరికీ పాన్ కార్డ్ ఉండడం తప్పనిసరి. బ్యాంక్ లావాదేవిలకు గాని, మరేదైనా ఆర్థిక పరమైన లావాదేవిలకు  పాన్ కార్డ్ తప్పనిసరిగా ఉండాల్సిందే. 

                ఇంటర్నెట్ లో ఉచితంగా ఈ – పాన్ కార్డ్ ను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ఈ బ్లాగ్ లో చూద్దాం. 

                ఇందుకోసం మనం ముందుగా గూగుల్ క్రోమ్ ను ఓపెన్ చేయాలి. సర్చ్ బార్ లో ఈ – పాన్ కార్డ్ అని టైపు చేయగానే ఈ క్రింది విధంగా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. 

                  ముఖ్యంగా పాన్ కార్డ్ లను రెండు వెబ్ సైటు ల ద్వారా పొందవచ్చు. అవి ముఖ్యంగా 

1. NSDL

2. UTIL

పాత పాన్ కార్డ్ లు అయితే అంటే 2008, 2009 సంవత్సరాలో తీసుకున్నవి అయితే nsdl వెబ్ సైటు నుంచి మరియు కొత్తగా పొందిన పాన్ కార్డ్ లు అయితే util వెబ్ సైటు నుంచి డౌన్ లోడ్ చేయవలసి ఉంటుంది.

           ఈ – పాన్ కార్డ్ ను డౌన్ లోడ్ చేయాలంటే మన పర్సనల్ మొబైలు నెంబర్ లేదా పర్సనల్ ఈ – మెయిల్ id  పాన్ కార్డ్ కు లింకు అయ్యి ఉండాలి. 

                 లేదా https://www.onlineservices.nsdl.com/paam/requestAndDownloadEPAN.html ఈ – వెబ్ సైటు లింకు గూగుల్ క్రోమ్ లో ఓపెన్ చేయాలి. తరువాత మన పాన్ కార్డ్ డీటైల్స్ ఎంటర్ చేసి కాప్ చ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే పేమెంట్ గెట్ వే ఓపెన్ అవుతుంది. 

                  గవర్నమెంట్ చలాన ప్రకారం సుమారుగా అమౌంట్ పి చేసి తరువాత వచ్చే స్క్రీన్ లో డౌన్ లోడ్ పాన్ కార్డ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీ కంప్యూటరు లో కి ఈ – పాన్ కార్డ్ డౌన్ లోడ్ అవుతుంది.. 

                మీ పాన్ కార్డ్ ఒక వేళ  UTI వెబ్సైట్ కి లింకు అయి ఉంటే అప్పుడు https://www.pan.utiitsl.com/PAN_ONLINE/ePANCard ఈ వెబ్ సైటు లింకు నుండి మీ యొక్క ఈ – పాన్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చును. 

                మీ పాన్ కార్డ్ డీటైల్స్ ను ఎంటర్ చేసి ఆ తరువాత స్క్రీన్ లో మినిమమ్ అమౌంట్ పే చేసి ఆ తరువాత స్క్రీన్ లో డౌన్ లోడ్ ఈ – పాన్ కార్డ్ బటన్ మీద క్లిక్ చేసి మీ యొక్క పాన్ కార్డ్ ను ఉతచితంగా డౌన్ లోడ్ చేసుకో వచ్చును.